నేటి సాక్షి, జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బొక్కల (బంగ్లా) నాగరాజుకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి సహకారంతో ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.49 వేల చెక్కును పీఏసీఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్‌రెడ్డి లబ్ధిదారునికి అందజేశారు. గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లేశం కరుణాకర్‌రెడ్డి భూమయ్యలు పాల్గొన్నారు.

