నేటి సాక్షి, హుజూరాబాద్ (రాఘవుల శ్రీనివాసు): హుజూరాబాద్ సీఐగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీ తిరుమల్ను కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, మహిళా విభాగం నాయకురాళ్లు మంగళవారం మర్యాదపూర్వంగా కలిశారు. సీఐగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, మహిళా అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, ఆలేటి సుశీల, దాసరి సదానందం, సమ్మెట సంపత్, కుర్ర శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల భిక్షపతి, పుల్ల రాధ, పంజాల రాజ్, రాజేష్, ఎండీ రియాజ్, ఎండీ నూర్ల తరుణ్, రేణుకా, స్నేహలత రెడ్డి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

