నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (జక్కుల సందీప్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫాంలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే విద్యలో రాణించాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలెదురైనా తనకు నేరుగా తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

