నేటి సాక్షి, బెజ్జంకి: సిద్దిపేట జడ్పీ సీఈవో రమేశ్ పార, చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. స్వచ్ఛదనం.. పచ్చదనంలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, సూపరింటెండెంట్ అంజయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేస్తూ కలియదిరిగారు. నీటి గుంతల్లోలు ఆయిల్ బాల్స్ వేశారు. మంచినీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచి క్లోరినేషన్ చేయాలని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. మొక్కలను విరివిగా నాటాలని వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్, పీఆర్ ఏఈ సమ్మయ్య, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఆర్డబ్ల్యూఎస్ హెల్పర్, సీఏలు, ఉపాధి హామీ, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన
బెజ్జంకి మండలంలోని తోటపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో ప్రవీణ్ తో కలిసి జడ్పీ సీఈవో రమేష్ పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

