నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (జక్కుల సందీప్): కోతుల బెదడ నుంచి తప్పించుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మేజర్ పంచాయతీ సారపాక కార్యదర్శి మహేశ్ వినూత్నంగా ఆలోచించారు. చింపాజి ఆకారం కలిగిన డ్రస్సును సిబ్బందికి వేయించి గ్రామంలో కోతులు ఎక్కువ తిరిగే ప్రాంతంలో తిప్పారు. దీంతో కోతులు బెంబేలెత్తి పరుగులు తీశాయి. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్యదర్శిని స్థానికులు అభినందనలు తెలిపారు.

