- మంత్రి సీతక్కకు వినతి
నేటి సాక్షి, ఆసిఫాబాద్: మాలి కులస్తుల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సీతక్కకు కాంగ్రెస్ ఆసిఫాబాద్ ఇన్చార్జి అజ్మీరా శ్యాం నాయక్ కోరారు. ఈ మేరకు సోమవారం మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలను విన్నవించారు. మాలిలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మాలిలకు ప్రత్యేక కార్పొరేషన్, జిల్లా కేంద్రంలో భవన నిర్మాణానికి నిధులు, జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రి బాయ్ పూలే విగ్రహా స్థాపన కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని అజ్మీర శ్యాం నాయక్ తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని చెప్పినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగోసి శంకర్, ప్రధాన కార్యదర్శి జీ మారుతి, బీసీ సంఘం రైతు జిల్లా అధ్యక్షులు వైరాగడే మారుతి పటేల్, మాలి సంఘం నాయకులు ఎం విశ్వనాథ్, వీ సోమాజి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

