Monday, January 19, 2026

మిస్ట్​కాల్ ​ఇవ్వండి.. ఓటరుగా నమోదు కండి..

  • – పట్టభద్రుల సౌకర్యార్థం 9240021444 నెంబర్​ఏర్పాటు
  • – అల్ఫోర్స్​విద్యాసంస్థల అధినేత నరేందర్​రెడ్డి
  • – మిస్డ్ కాల్ క్యాంపియన్ పోస్టర్ ను ఆవిష్కరణ

నేటి సాక్షి, కరీంనగర్: పట్టభద్రుల ఓటరు నమోదు సులభతరం చేసేందుకు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా ఒక మొబైల్ నెంబర్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ అల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్ లో పట్టబద్రుల ఓటు నమోదు కోసం మిస్డ్ కాల్ క్యాంపియన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు నమోదు కోసం మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా ఓటు నమోదు చేసుకునేందుకు 50 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము కేటాయించిన నెంబర్​9240021444 కు మిస్డ్ కాల్ ఇస్తే, తమ సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఓటు నమోదుకు సహకరిస్తారని వెల్లడించారు. ఓటరు నమోదుకు ఒక కలర్ ఫొటోతో పాటు ఆన్ లైన్ ఒరిజినల్ డిగ్రీ మెమోను అప్ లోడ్ చేయాలని సూచించారు. గతంలో 1లక్ష 97 వేల పట్టబధ్రులు మాత్రమే ఓటర్లుగా నమోదు అయ్యారని, ఇప్పుడు 4 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్ గా పనిచేస్తున్నామని వెల్లడించారు

  • ఫీజు రీయింబర్స్ మెంట్​విడుదలకు సహకరిస్తా..
    ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల ఫీజు రీయింబర్స్​మెంట్​నిధులు విడుదల గాక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి వీ నరేందర్​రెడ్డి పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోస్టర్​ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. కళాశాల యాజమాన్యం సంయమనం పాటించాలని కోరారు. గత నెల రోజులుగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలవ్యాప్తంగా ఓటర్ నమోదు అవగాహన కోసం పర్యటించానని, చాలామంది ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనవుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే యువత కోసం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా నిరుద్యోగులకు 6 నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే, ఉమ్మడి నాలుగు జిల్లాల్లో యువతకు స్కిల్ డెవలప్​మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తాను ఎమ్మెల్సీగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం తాను సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. ఓ ప్రధాన పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. పార్టీ టికెట్ రానట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమైనట్టు వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News