-కౌన్సిలర్ తాడూరి పుష్పకళ శ్రీమాన్…
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తాడూరి పుష్పకళా శ్రీమాన్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎమ్మార్వో సమక్షంలో కళ్యాణ లక్ష్మి చెక్కును లబ్ధిదారులైన లక్ష్మికి అందించారు. స్వశక్తి మహిళా సంఘాలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల తోడ్పడు తో వడ్డీ లేని రుణాలు అందిస్తుందని తెలిపారు 12 రకాల వ్యాపారాలను ప్రభుత్వం గుర్తించి మహిళా సంఘాలకు అప్పజెప్పాలని ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణారావు ఉన్నట్లు తెలిపారు. మహిళల సాధికారత విషయంలో ప్రభుత్వం వెనుకంజు వేసా అవకాశం లేదని ఆశాభావం వ్యక్తపరిచారు.