- బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు సింహాచలం జగన్
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): లగచర్ల గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని సింహాచలం జగన్ రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో మంగళవారం మండలంలోని సూరారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింహాచలం జగన్ ఆద్వర్యంలో మండల నాయకులతో కలిసి లగచర్ల రైతుల పట్ల రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ… వారిని తక్షణమే విడుదల చేయాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా జగన్ మాట్లడుతూ… లగచర్ల గిరిజన రైతులను అక్రమంగా జైలులో నిర్బంధించి, చిత్రహింసలకు గూరిచేయడం రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనం అని అన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనజాలలేదని సీఎం గుర్తంచుకోవాలన్నారు.రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎంకు సద్బుద్ధి ప్రసాదించాలని, అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజారాంపల్లి మాజీ యంపిటిసీ గాజుల మల్లేశం, సీనియర్ నాయకులు పడిదం నారాయణ, మెతుకు స్వామి, పడిదం వెంకటేష్, గంధం రవి, వుస్కమల్ల పరందాములు, ఉప్పు రాజన్న, గాదం బాస్కర్, దుర్గం కృష్ణ, చింతల తిరుపతి, గౌరీ చిరంజీవి, ఇప్పాల రాజు, రాజేశం, అరికిల్ల మహేందర్, దేవి నరేష్, పందిళ్ళ రాజిరెడ్డి, కొమ్మ సంజీవ్, తిరుపతి, చెరుక కేశవ్, చెల్పూరు లచ్చయ్య, అల్లంల శేఖర్, దప్పుల రవి, మహిళ కార్యకర్త జాడి దృశ్యాంత రాణి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.