నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ ఎమ్మార్వో కనుకయ్యకి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతుల పై వ్యవరిస్తున్న తీరు చాలా దుర్మార్గకరమని అరెస్ట్ చేసిన రైతులను ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఆస్పత్రికి తీసుకువెళ్లే సందర్భంలో రైతులకు సంకెళ్లు వేసి తీసుకుపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఏ ప్రభుత్వం కూడా సంకెళ్లు వేసిన చరిత్ర లేదని, ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే రైతులను ఓ ఉగ్రవాదులగా, హత్యలు చేసిన నిందితుల్లాగా తీసుకువెళ్లడం ఏంటని ఆయన అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు మంచి చేయడమే తప్ప ఏ ఒక్క రోజు కూడా రైతులను ఇబ్బందులు పెట్టిన సందర్భమే లేదని గుర్తు చేశారు. రైతుబంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతుల కుటుంబాలను ఆదుకున్నారే తప్ప ఇలా ఎన్నడు చేయలేదని చెప్పారు. వారి భూములను ఇవ్వమని చెప్పినందుకు కేసులు పెట్టి వారిని జైల్లో వేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి పాలన దుర్మార్గకరమని, అరెస్టు చేసిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల కోసం మేము మా పార్టీ ఎంత దూరమైనా వారికి న్యాయ జరిగే వరకు వారి కోసం దేనికైనా సిద్ధపడి ఉన్నామని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను జైల్లో వేసి ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని, రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షులు సంగేమ్ ఐలయ్య, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వి కిషన్, గనిశెట్టి ఉమ మహేశ్వర్, కొండ్ర నరేష్, ప్రతాప్ కృష్ణ, ఎండి ఇమ్రాన్, బిఆర్ఎస్ నాయకులు అక్కినపల్లి శిరీష, బి సమ్మయ్య, ధనవర్ష రాజు, ఎర్ర రాజ్ కుమార్, ములుగు శ్రీను, విడపు అనురాగ్, మోరె మధు తదితరులు పాల్గొన్నారు.

