నేటి సాక్షి, బెజ్జంకి:
తెలంగాణ గ్రామ పంచాయితీ సిబ్బందినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బందిని మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఎఎస్ఐ శంకర్ రావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నెం. 51ని సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లపై చర్చలు జరపకపోతే, డిసెంబర్ 20 తర్వాత ఏ రోజు నుండైనా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ కార్మిక సంఘం స్పష్టం చేసింది.