నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : గద్వాల్ నియోజకవర్గం కేటి దొడ్డి మండలంలోని కొండాపురం గ్రామం లో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ వీధి వీధినా వాడవాడనా నినాదాలు చేస్తూ సిఆర్పిఎఫ్ సభ్యులు గాజుల కృష్ణ గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి 21 సంవత్సరాలు అబ్బాయిలకు నిండిన తరువాత చేయాలి. అమ్మాయిలకు కూడా అబ్బాయిలకు ఇచ్చినంత స్వేచ్ఛ ఇవ్వాలని అలాగే వారి లక్ష్యం నెరవేర్చుకున్నంత వరకు చదివించాలని బాల్య వివాహాలు చేయడం వలన పుట్టబోయే పిల్లలకు 52 రకాల జబ్బులతోని జన్మిస్తారు. కాబట్టి బాల్య వివాహాలు చేయరాదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం సి ఆర్ పి ఎఫ్ తిమరెడ్డి రమేష్, వీరేష్, ఆంజనేయులు, కార్తీక్ యుగంధర్ పద్మారెడ్డి పాల్గొన్నారు.