- సమాజ సేవలో పోలీసులు ముందుంటారు
- రామగుండం కమిషనర్ ఎం. శ్రీనివాసులు


నేటి సాక్షి,వేమనపల్లి;
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ సేవలో పోలీసులు ముందుంటారని రామగుండం కమిషనర్ ఎం. శ్రీనివాసులు అన్నారు. వేమనపల్లి మండలంలోని దాస్నాపూర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో బుధవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాలలోని గిరిజనుల అనారోగ్యంతొ, రోగాల పోలౌతున్బానారని గుర్తించి పోలీసు శాఖ తరుపున వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులతో వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రస్తుతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినది అని అన్నారు.
కుటుంబానికి పెద్దలాగా, అన్నలాగా ఎల్లప్పుడు పోలీస్ శాఖ:
ప్రజల సమస్యల అవసరాల కోసం భద్రత కోసం ఒక అన్నలాగా కుటుంబ పెద్దలాగా పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు. మారుమూల ఆదివాసి గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఆదివాసీలకు అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ప్రజల రక్షణకే పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు. అలాగే వృద్దులకు దుప్పట్లు, బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ కిట్‌లను పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి సహకరించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్‌ఐ శ్యాం పటేల్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను సన్మానించారు. వైద్య శిబిరంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారుగా 800 మంది పాల్గొనగా వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తినడానికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూరు టౌన్ ఎస్సై రవీందర్, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్,కో టపల్లి ఎస్సై రాజేందర్,జైపూర్ ఎస్సై శ్రీధర్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ రమేష్, పిహెచ్ సి డాక్టర్ రాజేష్, మాజీ జెడ్పిటిసి సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, పీఈటీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

