- హోమ్ మంత్రి అమిత్ షా భారత ప్రజలకు భే షరతుగా క్షమాపణలు చెప్పాలి
- అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు డిమాండ్

నేటి సాక్షి, లక్షెట్టిపేట (బైరం లింగన్న ) : రాజ్యాంగ రచయిత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జోలికి వస్తే ఊరుకోమని, కేంద్ర హోమ్ మంత్రి నిండు సభలో భారత రత్న, రాజ్యాంగ రచయిత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించి నందుకు భారత ప్రజలకు భే షరతుగా క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ను విమర్శించినోళ్లంతా కాలాగర్భంలో కలిసి పోయారని, అంబేద్కర్ పేరు మాత్రం చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోతుందన్నారు. బీజేపీ నిరంతరం రాజ్యాంగంపై దాడిచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కులను హరిస్తుందన్నారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికైనా తమ అగ్రకుల బుద్ది మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ది చెపుతారన్నారు. రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చి రాజ్యాంగంపై దాడి చేసి మనువాదాన్ని పునః ప్రతిష్ట చేయాలని చూడడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా బీజేపీ, అమిత్ షా బుద్ది మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మేకల బానేష్, కల్లేపల్లి విక్రమ్, పులి సునీల్, అల్లంపల్లి రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

