
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
పెద్దపల్లి గాయత్రి డిగ్రీ & పీజీ కళాశాలకు చెందిన పీజీ సెకండియర్ చదువుతున్న అప్పన్నపేట గ్రామానికి చెందిన పిడుగు శ్రీకాంత్ ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఎంపిక కావడం గర్వంగా ఉందని కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. డిసెంబర్ 25,2024 నుండి జనవరి 05/2025 వరకు పంజాబ్ లో జరిగే పోటీలకు హాజరు అవుతున్నారని ఈ ఘనత సాధించడానికి కళాశాల అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. క్రీడారంగంలో గాయత్రి కళాశాల విద్యార్థులు దక్కించుకుంటున్న ఈ గుర్తింపు విద్యా, క్రీడా రంగాలలో స్పూర్తి దాయకంగా నిలిచేలా చేస్తుందన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ అధ్యాపకులు, విద్యార్థులు అతని విజయవంతమైన ప్రదర్శన కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే.రవీందర్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

