- సామాజిక కార్యకర్త పసుల స్వామి

నేటి సాక్షి-హుజురాబాద్:( రాఘవుల శ్రీనివాసు)
ఎస్సారెస్పీ డిబిఎం-17 ఉపకాలువను వెంటనే మరమ్మత్తులు చేయాలని సామాజిక కార్యకర్త పసుల స్వామి డిమాండ్ చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపాపయ్యపల్లి, హుజురాబాద్, రాంపూర్, రంగాపూర్ గ్రామాల్లోని సుమారు 200 ఎకరాల ఆయాకట్టు డిబిఎం-17 పరిధిలోకి వస్తుందన్నారు. ఈ కాలువ ద్వారానే సాగునీరు అందాల్సి ఉండగా చిత్తా చేదారంతో నిండిపోయిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ కాలువ పెద్ద పాపయ్య పల్లి నుండి ప్రారంభమై హుజురాబాద్ పోచమ్మ గుండ్ల కింది వరకు వెళ్లి వాగులో కలుస్తుందన్నారు. ఉపకాల్వ కింద ఆయకట్టు రైతులు సంవత్సరానికి రెండు పంటలు పండించుకుంటారని తెలిపారు. గత ఐదు సంవత్సరాలగా కాల్వలో నీరు వెళ్లకుండా అడ్డుగా తుంగ గడ్డి, పిచ్చి చెట్లు ముళ్లపొదలు, పూడిక తో నిండిపోయిందన్నారు. కాలువ చివర ఉన్నటువంటి రైతులకు నీరు అందకుండా తగాదాలు, ఘర్షణలు పడుతున్నారని, చివరి రైతులకు సక్రమంగా నీరు రాక పొలాలను బీడుగా పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పలమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రబీ సీజన్లో రైతులందరూ నేడో, రేపో కాలువ నీళ్లు వదులుతారని, వరి పంట సాగు చేసుకుందామని ఆయకట్టు రైతులు నార్లు పోసుకోవడానికి ఆశగాఎదురుచూస్తున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి కాల్వను మరమ్మత్తులు చేయించాలని కోరారు.

