నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక- శ్రీనివాస్ గృహం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి దివ్య మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఉదయం అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇంటి వద్ద అందంగా అలంకరించిన అయ్యప్ప పదునెట్టాంబడి పై ఉత్సవ విగ్రహాలను ఉంచి అయ్యప్ప పడిపూజను సాంప్రదాయ బద్ధంగా శాస్రోత్తంగా నిర్వహించారు. అయ్యప్ప భక్తులు పాటలతో నృత్యాలతో పేట తుళ్ళి చేస్తూ పరవశించి పోయారు. ప్రత్యేక భజన బృందాలు భక్తితో ఆలపించిన భక్తి గీతాలు అయ్యప్ప స్వాములను, భక్తులను పరవశింపజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం పడి వెలిగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాముల తో పాటు అయ్యప్ప భక్తులు బంధుమిత్రులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు గురు స్వాములు, పలువురు ప్రజాప్రతినిధులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.