నేటి సాక్షి ప్రతినిధి జోగుళాంబ గద్వాల్:
జిల్లా కేంద్రం లో విలేకర్ల సమావేశంలో బండారి సునంద్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ పేరును హేళనగా ఉచ్ఛరిస్తూ అమిత్ షా పార్లమెంటులో మాట్లాడిన తీరును బి ఆర్ యస్ పార్టీ జిల్లా నాయకులు బండారి సునంద్ తీవ్రంగా ఖండించారు. ఈ దేశ ప్రజలకు అమిత్ షా, మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ నీ అంతం చేయడానికి దిగి వచ్చిన ఆధునిక మనువే ఈ అమిత్ షా. పార్లమెంట్ లో అంబేడ్కర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సమయం లో భారత రాజ్యాంగానికి విలన్ లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, సోషలిస్టులూ… అగ్ర వర్ణ, ఆధిపత్యంలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి సంస్థ బాబా సాహెబ్ అంబేద్కర్ కు, భారత రాజ్యాంగానికి బద్ద శత్రువులు అని ప్రకటిస్తున్నామని అన్నారు. బి ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమును రచించక పోతే నువ్వు అనుభవించే పదవి నీకు వచ్చేదా కేంద్ర హోం మంత్రి గారూ అని ఆన్నారు. కాబట్టీ బేషరతు గా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. లేకపోతే మంత్రి పదవీ నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామజిక నాయకులు ప్రవీణ్ కుమార్ మరియు ఉదయ్ లు తదితరులు పాల్గొన్నారు.