పిజెపి క్యాంపు లోనే జిల్లా కోర్ట్ సముదాయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్…
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు సముదాయ నిర్మాణ స్థలం విషయంలో గత 3 రోజులుగా జిల్లా కోర్ట్ ఆవరణలో న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు బిఆర్ఎస్ పార్టీ తరుఫున బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు తన సంపూర్ణ మద్దతును ప్రకటించి, న్యాయవాదుల చేస్తున్న నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జిల్లా ప్రజలకు ఆమోదమైనా స్థలంలోనే కోర్టును నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హాయాంలోనే స్థల సేకరణ, నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ఈ రోజు మెజారిటీ న్యాయవాదులు ఆ స్థలం వద్దని తీర్మానం చేసి విధులు బహిష్కరణ చేప్పట్టిన నేపథ్యంలో పార్టీలో ఈ విషయమై చర్చించడం జరిగిందన్నారు. తాము కూడా ప్రజలు, కక్షిదారుల కోణంలో ఆలోచించి న్యాయవాదులు చేస్తున్న ఆందోళన న్యాయ బద్ధమైనది అని అన్నారు. జిల్లా కోర్టుకు పూడురు శివారు స్థలాన్ని కేటాయిస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గద్వాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అని అన్నారు. న్యాయవాదుల డిమాండ్ న్యాయబద్ధమైనది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు గాని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గాని అనంతపురం గుట్టలో కాకుండా పిజెపి క్యాంపులో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ పని సాధనకు గద్వాల బార్ అసోసియేషన్ చేపట్టనున్న ఏ నిరసన కైనా మా పార్టీ మద్దతుగా నిలుస్తుందని బాసు హనుమంతు నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు అంగడి బసవరాజ్, మోనేష్, జయ సింహ రెడ్డి, నూర్ పాషా, శ్రీరాములు, గంజిపేట రాజు, ఎస్.రాము నాయుడు, కొళాయి భాస్కర్, రాజు నాయుడు, కంగారు తిమ్మప్ప, బీ ఆర్ ఎస్ వి జిల్లా నాయకులు మాల మల్లికార్జున్, నరసింహులు, భాస్కర్, రాజు, ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, మన్యం, సామేలు,రాము, తిమ్మప్ప, ఆంజనేయులు, నర్సింహా, కళ్యాణ్, పరుశరాముడు, జగదీష్, కామేష్, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

