Monday, December 23, 2024

అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి

  • భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

నేటిసాక్షి, కామారెడ్డి:
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారత వనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతూ ఏళ్ల తరబడి సకలంగుల పాలకుల చేత అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సమాజం రాజ్యాధికారం కోసం ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని వికలాంగుల సమాజం రాజ్యాధికారంలో వాటా సాధించుకుంటేనే సమ సమాజంలో మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుందని 78 ఏళ్ల నుంచి వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి అడుగడుగున వికలాంగుల సమాజాన్ని విస్మరించిన సకలంగుల పాలకులపై తిరుగుబాటు చేసేందుకు వికలాంగుల సమాజం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు మునుంపెట్టి మరి వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటివరకు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీ ఎన్నికల హామీలు నెరవేర్చెంతవరకు అలుపెరగని పోరాటం కొనసాగించేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కామారెడ్డి జిల్లా శ్రేణులు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో వికలాంగులకు వికలాంగుల జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేయాలని, సంఘం నేతలకు పిలుపునిచ్చిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వికలాంగుల సమాజంపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా ప్రత్యేక చట్టం తేవడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచాలని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్ధవంతంగా అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం రాష్ట్ర నాయకులు బైండ్ల భూపతి బర్దావల్ రామ్ సింగ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ మోహన్, మహేష్, మహిళా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News