నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
పార్లమెంటు లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ అవమాన పరుస్తూ భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచినాడు. ఇట్టి వాక్యాలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి ని బర్తరఫ్ చేయాలని మరియు బిజెపి నుంచి బేషరతుగా తొలగించాలని అతని పై యస్సి యస్టి కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యస్సి సెల్ పట్టణ అధ్యక్షులు ఏర్ర రవీందర్, సొల్లు బాబు, లంకదాసరి లావణ్య, కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, ఏర్ర రమేష్, కడారి తిరుమల, సొల్లు సునిత మరియు ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, మోరె సతీష్, ఇల్లందుల సమ్మయ్య, సంధ్యల వెంకటేశ్వర్లు, దాట్ల ప్రభాకర్, తిప్పారపు భువనచందర్, రేణికుంట్ల సందీప్, చిట్యాల రేవంత్, యండి అఫ్సర్, యండి సాదిక్, బోరగాల రాజయ్య, వేల్పుల రత్నం, లంకదాసరి ప్రవీణ్, బీమోజు సదానందం తదితరులు పాల్గొన్నారు.