- -నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య,
- రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్.హెచ్.ఆర్.సి) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల అధ్యక్షులుగా రాచర్ల వేణును నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య,ఉత్తర్వులు జారీ చేశారు. హుజరాబాద్ పట్టణంలో జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు సామాజిక అంశాలపై చర్చించి అనంతరం ఈ నియామకాలను అందించారు. అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం బాధ్యతగల భారత పౌరులుగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ప్రతి పౌరుడు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని, హక్కులకు భంగం కలిగినా, ఉల్లంఘన జరిగినా భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, హనుమకొండ జిల్లా అధ్యక్షులు విసంపల్లి నగేష్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పులుగు లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.