నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎక్లేసియా మినిస్ట్రీ రెవరెండ్ డాక్టర్ డి డేవిడ్రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు బుధవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ వర్తమాని బిషప్ డేనియల్ డి కళ్యాణపు హాజరై క్రీస్తును గురించి ప్రత్యేక సందేశం అందించారు. ఏసుక్రీస్తు ఒక ప్రాంతము ఒక దేశము వాడు కాదని ప్రపంచ శాంతి దూతగా పాప విముక్తి కోసం సిలువలో ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహనీయుడని అన్నారు. ప్రేమ శాంతి దయ గుణాలను క్రీస్తును చూసి ప్రతి ఒక్క వ్యక్తి శాంతి మార్గంలో నడిచి దేశ శాంతి కోసం పాటుపడాలని బిషప్ డేనియల్ డి కళ్యాణపు బోధించారు. ఈ వేడుకలకు ఎక్లేసియా పూల్ గాస్పల్ మినిస్ట్రీ యవ్వనస్తులు, పిల్లలు పాటలతో స్కిట్లతో ప్రజలను అలరించారు. మరొక అతిథి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలని, శాంతియుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. బిషప్ తో కలిసి శ్రీనివాస్ పాస్టర్లు ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి కేకుతోపాటు పండ్లు అక్కడికి వచ్చిన అందరికీ పంపిణీ చేశారు. సంఘ దైవజనులు డేవిడ్రాజు దయామని దంపతులు సంఘ సభ్యులతోపాటు క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా హాజరు కాగా వీరందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాస్టర్స్ ఏసుదాసు, రెవరెండ్ డాక్టర్ పి ఆర్ నెల్సన్, ప్రేమ్ కుమార్, ఆనంద్, మార్క్, సామ్సన్ జాషువా, ఏలియా తోపాటు సుమారు 800 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు