నేటి సాక్షి ధర్మపురి ప్రతినిధి (శ్రీకాంత్ గౌడ్) :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన బోరె లక్ష్మణ్ రూ.60,000, రామిల్ల రాజమ్మకు రూ.14,000 మంజూరయ్యాయి. కాంగ్రెస్ నాయకులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మార్కెట్ కమిటి డైరెక్టర్ దూడ రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రామగిరి నందయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి ఎల్లయ్య, ఐట్ల రవి, అనుమండ్ల శ్రీనివాస్, చొప్పదండి ప్రశాంత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.