నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ :
పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ 3,580 కోట్లను తక్షణమే విడుదల చేయాలి.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ దగ్గర జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్, మాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, జిల్లా గర్ల్స్ కోకన్వీనర్ భవిత, రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి కార్తీక్ నాయక్, తంబాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి గణేష్, రాయచోటి పట్టణ కార్యదర్శి లోకేష్, తదితరులు పాల్గొన్నారు.