నేటి సాక్షి,వేమనపల్లి :
వేమనపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రోజున సంస్థగత ఎన్నికలలో భాగంగా మండల కమిటీ ఎన్నికల నిమిత్తం అభిప్రాయ సేకరణ చేపట్టడానికి మండల ఎన్నికల సంయోగి రాపర్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేమనపల్లి మండల అధ్యక్షుని ఎన్నిక,మండల కమిటీ ఎన్నిక కోసం బీజేపీ సీనియర్ నాయకులు,బూత్ అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులతో అభిప్రాయం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్,ప్రధానకార్యదర్శి ఎనుముల వెంకటేష్,దుర్గం పుల్లయ్య,కంపెల అజయ్ కుమార్,కోయిల స్వామి,కొఠారి సతీష్,కుబిడే అంజన్న,మడె సమ్మయ్య పాల్గొన్నారు.