Monday, December 23, 2024

స్వశక్తి మహిళా సంఘాల పై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం పాల్గొన్నజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
జిల్లాలో ఉన్న మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల పై సంబంధిత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపెల్లి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 9102 మహిళా సంఘాలకు సుమారు 478 కోట్ల రుణాల మంజూరు చేయడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3898 సంఘాలకు 322 కోట్ల 68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, నిర్దేశిత లక్ష్యంలో 67.51% రుణాలు మంజూరు చేసామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో పెండింగ్ బ్యాంకు లింకేజీ రుణాలను మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.పెద్దపెల్లి జిల్లాలో ఉన్న ఎన్.పి.ఏ లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్.పి.ఏ లు అధికంగా ఉన్న సీసీ లు ప్రత్యేక శ్రద్ధ వహించి నెల రోజులలో వాటిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల గ్రేడింగ్ 3 నెలల కాలంలో పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రేడింగ్ ఈ ఉన్న స్వశక్తి మహిళా సంఘాల పై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని బి, లేదా ఏ గ్రేడింగ్ వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని మహిళా సంఘాలలో నూతనంగా మహిళలను జాయిన్ చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. స్త్రీ నిధి రుణాల రికవరీ పై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద గ్రౌండ్ చేసిన యూనిట్లు లాభదాయకంగా నడిచేలా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, అడిషనల్ డి ఆర్ డి ఓ రవికుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News