నేటి సాక్షి ప్రతినిధి కుందుర్పి:
కుందుర్పి మండలం కుందుర్పి గ్రామ పంచాయతీలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మాజీ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు జి.రవి మాట్లాడుతూ భూ పరిష్కారాలు తాసిల్దార్ వద్దకు తీసుకువెళ్లి ఆ భూ పరిష్కారాల కనుగుణంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు కుందుర్పి మాజీ సర్పంచ్ పెద్ద నరసింహ మాజీ ఎంపీటీసీ మల్లికార్జున మాది కో ఆప్షన్ నెంబర్ తాహిర్ భాషా, కుందర్పి పంచాయతీ కన్వీనర్ బోయ రంగనాథ్ దండోరా నాయకుడు ఓబయ్య, రెవెన్యూ సిబ్బంది, మరి కొందరు నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.