- హిందూ ఐక్యవేదిక డిమాండ్
నేటి సాక్షి, జమ్మికుంట :
హిందువులపై, హిందూ ధర్మంపై, మన సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీస్తున్న కొన్ని మతసంస్థలు వారి పద్ధతులు మార్చుకోకపోతే హిందూ సమాజం తిరుగుబాటు చేస్తుందని, మన దేశం సొమ్ముతిని మనల్ని కించపరిచే ఊకునే ప్రసక్తి లేదని జమ్మికుంట హిందూ ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అదే విధంగా మన ప్రాంతంలో హిందూ దేవాలయాల్లో కానీ, హిందూ సంస్థలు కానీ, అయ్యప్ప, హనుమాన్ మాలదారులు కానీ ఏ కార్యక్రమం చేపట్టిన కూడా ప్రజలు ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పలు వక్తలు హిందూ సమాజానికి పిలుపునిచ్చారు.
జమ్మికుంట పట్టణంలోని వర్తక సంఘం ఫంక్షన్ హాల్ లో నేటి మధ్యాహ్నం హిందూ ఐక్యవేదిక మరియు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పలువురి అభిప్రాయాలను వ్యక్తపరిచి మన సమాజంపై చులకన చేసే వారిని సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు గుండా వరప్రసాద్, ఆకుల రాజేందర్, ఎలిమిలి రాజేంద్రప్రసాద్, సిరిమల్ల జయేందర్, డింగరి రవికుమార్, శీలం శ్రీనివాస్,సముద్రాల వరప్రసాద్, కపర్తి శర్మ, దుర్గా శర్మ, ఆవాల రాజారెడ్డి, బుర్ర శివయ్య, ఉప్పుల శ్యామ్, ఎక్కడి రగోతంరెడ్డి, కేతిపల్లి మాధవరెడ్డి, కనబోయిన గోపీనాథ్, కొండ్ల నాగేష్, బచ్చు శివకుమార్, యమసాని సమ్మయ్య, దాసరి రవీందర్, పోతిరెడ్డి నాగయ్య, గర్రెపల్లి నిరూపమారాణి, నాగపూర్ విజయ్, కురుమిళ్ళ అశోక్, శివానందం తదితరులు పాల్గొన్నారు.