- లాక్కునే ప్రయత్నంలో కోడలు, మనుమడు
- మీడియాతో గోడు వేళ్ళబోసుకున్న తొగరు లక్ష్మి
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలోని శుక్రవారం రోజున కానిపర్తి గ్రామానికి చెందిన తోగరి లక్ష్మి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నా సొంత ఆస్తి నావాళ్ళకిచ్చుకునే హక్కు నాకు లేదా..? కోర్టు ఉత్తర్వులను అమలుపరిచి, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వయోవృద్ధురాలు తొగరి లక్ష్మి కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం విలేకరుల సమావేశంలో గోడు వెళ్లబుచ్చుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వయోవృద్ధురాలు తొగరి లక్ష్మి కి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పురుషోత్తం కొద్ది రోజులు క్రితం కాలం చేశారు. అయితే తన పేరు మీద నాలుగున్నర ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉన్నదని, ఇందులో నుండి ఒక ఎకరంన్నర తన పేరు మీద ఉంచుకొని, మూడెకరాల భూమిని తన బిడ్డ కూతురు మనమరాలు పేరు జట్టి తులసి కి బహుమనంగా గిఫ్ట్ డీడి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చానని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కోడలు తొగరి ధనలక్ష్మి, మనవడు నాని, మరియు కొంతమంది గ్రామస్తులు రాజకీయ నాయకుల అండదండలతో డబ్బు ఎగజల్లి తన పేరు మీద ఉన్న భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నో సార్లు నాపై దాడికి ప్రయత్నించారని, తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన కూతురి ఇంట్లో తల దాచుకుంటున్నానని విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూవివాదం పెద్దగా ముదిరి తన మనవరాలు తన పేరుపై ఉన్న అన్ని వర్జినల్ పట్టా పాస్ పుస్తకం రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ అన్నిటితో హనుమకొండ జూనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించడం ద్వారా పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని ఈ విషయంపై కమలాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదు చేశానన్నారు. విషయాన్ని పరిశీలించిన సదరు పోలీస్ అధికారి భూమిపై వెళ్లి కనీలు వేసుకోమ్మని పోలీసు భద్రతను పంపించాడని, పోలీసు భద్రత వలయంలో ఈనెల 4 తారీఖు నాడు ఖనీలు పాతుతుండగా కోడలు తోగరు ధనలక్ష్మి తన కుమారుడు నాని మరి కొంతమంది గ్రామస్తుల సహాయంతో దౌర్జన్యంగా పైకి వచ్చి పోలీసులను సైతం లెక్కచేయకుండా దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయం విన్న పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులు ఉన్నందున, ఈ విషయంలో తొగరి లక్ష్మి, జట్టి తులసి లు అర్హులని మీకు ఎలాంటి రైట్స్ లేవని తోగరి ధనలక్ష్మికి చెప్పి పంపించారని తెలిపారు. ఇదే క్రమంలో కోర్టు ఉత్తర్వులు ఉన్న బాధితుల మర్నాడు ఐదు తారీకు నాడు 200 ఖనీలు సుమారు రెండు లక్షల విలువగల హద్దురాల్ల ను లేబర్ను కేటాయించి ఖనీలు పాతించే పని పూర్తి చేసుకున్నారు, మరుసటి రెండు రోజులకు మధ్యరాత్రి ఎవరు లేని సమయంలో ఒక డోజర్ ద్వారా కనీలన్నీ ధ్వంసం చేసి నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ భూమిలోకి ఎవరొస్తారో ఏం చేస్తారో వారి అంతు చూస్తాం అంటూ హెచ్చరికలు చేశారని, తన కోడలు తన మనవడు ఇతరులతో తనకు, తన బిడ్డకు, తన మనవరాలు, అల్లుడికి ప్రాణభయం ఉన్నందున కోర్టు ఉత్తర్వులును వెంటనే అమలు చేసి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయంలో కూడా కేసు నమోదు అయిందని, మళ్లీ గురువారం రోజు 19 తారీఖు పోలీస్ అధికారుల ఆదేశానుసారం సుమారు 70 కనీలు పాతగా వాటిని సైతం కూలగొట్టి నేల మట్టం చేసినారని వృద్ధరాలు తోగరి లక్ష్మి మహిళా తన బాధను వెలిబుచ్చింది. ఇదిలా ఉండగా తోగరి లక్ష్మి మనవరాలు తులసి సైతం కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.