నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
గడ్డం వెంకటస్వామి కాక వారి పదవ వర్ధంతి హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించడం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సొల్లు బాబు మాట్లాడుతూ… కాక తెలంగాణ కొరకు అహర్నిశలు కృషి చేశాడని, సోనియా గాంధీ ని ఒప్పించడంలో వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని, కాక తెలంగాణ తీసుకరావడంలో తన వంతు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొలిపాక సారయ్య, సొల్లు దశరథం, అప్పల రఘుపతి, సొల్లు మహేందర్, గడ్డం దయాకర్, సొల్లు రమేష్, కొత్తూరి జీవన్, దాట్ల ప్రభాకర్, చౌదరి, స్వామి, సొల్లు సునీత తదితరులు పాల్గొన్నారు.

