- ఆర్థిక సంస్కరణలకు ఆద్యం పోసిన మేధావి పీవీ.
- కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రణవ్.
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టీ, టెక్నాలజీ, మొబైల్ రంగంలో ప్రైవేటీకరణ చేసి దేశంలో వినూత్న మార్పు తీసుకొచ్చి దేశం అభివృద్ధి విషయంలో ఇతర దేశాలకు పోటి పడేలా చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, ఆయన తీసుకున్న నిర్ణయాలే దేశానికి పునదిరాళ్ళుగా మారాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం నాడు పీవీ 20వ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుభాషా కోవిదుడుగా పేరుగాంచి కార్యకర్త స్థాయి నుండి ప్రధాని వరకు పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని అన్నారు. విద్యా వ్యవస్థలో నవోదయ పాఠశాలను నెలకొల్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తోడ్పాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు