నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ కోర్టు ఆదనపు ప్రభుత్వ న్యాయవాది (ఎజీపీ) గా గుర్రం శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ ప్రభుత్వ లీగల్ అఫెర్స్ సెక్రటరీ జీవో ఆర్.టి నెంబర్ 852, తేదీ 18.12.224 ద్వారా ఉత్తర్వులు జారీచేయగా తదనుగుణంగా జిల్లా కలెక్టర్ పమెల్లా సత్పతి సి3/1632/224, తేదీ 23.12.2024 ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గతంలో కూడా రెండు పర్యాయాలు ఏజీపీగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రవాణా మరియు బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్ బాబు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ నియామకం పట్ల హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, న్యాయవాదులు గౌరు సమ్మిరెడ్డి, టి.సాయన్న, ముక్కెర రాజు, జి. లక్ష్మణమూర్తి, బండి కళాధర్, పి. శ్రీధర్ బాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.