- అన్నం పెట్టే అన్నదాతలకు అందలం రూ. 21 వేల కోట్ల రుణమాఫీ
- 500 బోనస్ దేశ చరిత్రలోనే సంచలనాత్మక విజయం
- సంక్రాంతి తర్వాత రైతు భరోసాతో రెట్టింపు సంబురం
- ఇది ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రజా ప్రభుత్వం
- జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతాంగానికి శుభాభినందనలు
- హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ …
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
వ్యవసాయంలోనే సాయం ఉందని అలాంటి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు జాతీయ రైతుదినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో రైతు దినోత్సవ వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రణవ్ కు రైతులు నాగలిని బహుకరించారు. ప్రణవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభు చేస్తున్న సేవలను తెలిపారు. గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం నుండి రైతుల సంక్షేమానికి కృషి చేసిందని దాంట్లో భాగంగానే దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా రైతులకు రుణమాఫీ చేసి వారి రుణాన్ని తీర్చుకుందని, అలాగే సన్న రకాలు వేసిన ప్రతి రైతుకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలబడ్డామని, అంతేకాకుండా వచ్చే సంక్రాంతి నుండి గతంలో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి రైతుబంధు నిధులను పక్కదారి పట్టకుండా రైతు భరోసా పేరుతో పక్కగా ఇస్తున్నామని అన్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి వారికి బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు.