Monday, December 23, 2024

ఎల్ఎండి కెనాల్ నీటిని యాసంగి సాగుకు వెంటనే విడుదల చేయాలి

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్ ప్రారంభమై, నారు మడులు ఎదిగినప్పటికీ రైతాంగం నాట్లు వేసుకోవాలంటే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, కెనాల్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజరాబాద్ పట్టణ కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయినటువంటి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేద వారికి వెంటనే కేటాయించాలని, ఇది చేయకుండా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ, ఉత్సవాలు జరుపుకుంటుంది తప్ప, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరుగరంటీలను, పూర్తిస్థాయిలో అమలు చేయడంపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల సర్వే తో కాలం వెళ్లదీసే కార్యక్రమం చేపడుతుందని, దీనిలో సర్వే ఎంటర్ చేయడంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాడకుండా, ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, నిరంతరం (బి.ఆర్.ఎస్) పార్టీ, కేటీఆర్, కెసిఆర్ సమస్యలు ఉన్నట్టు, వారి కోసమే పని చేస్తున్నడూ అనే భావన ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. కావున ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితు పలికారు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ ఎమ్మెల్యే గెలవలేదులే అనే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం దృష్టి సారించడం లేదని ఆరోపించారు. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రానున్న రోజులలో మండల ప్రజా సమస్యలనే పోరాటాలు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం హుజురాబాద్ మండల కార్యదర్శి కొప్పుల శంకర్, కదిరే రమేష్, కొంకట చంద్రయ్య, రాచపల్లి సారయ్య, దొడ్డ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News