Tuesday, January 20, 2026

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
పండుగల ద్వారా సంతోషం వెళ్లి విరుస్తుందని మరియు సోదర భావం పెంపొందించడం జరిగిందని మరియు యేసుక్రీస్తు శాంతికి చిహ్నం అని సుఖ సంతోషాలకు నిలయమని వారు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కడు అనుసరించి సమాజంలో ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా ముందుకు సాగి ఉత్తమమైన జీవితాన్ని కొనసాగించాలని ఆల్ఫోస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఆల్ ఫోర్స్ జీనియస్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంతకుముందు వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రైస్తవులు క్రమం తప్పకుండా వారు ప్రవేశపెట్టినటువంటి బోధనలను పాటించడం చాలా శుభ పరిణామం తెలియజేస్తూ వారానికి ఒకసారి వారు చేపట్టినటువంటి సామూహిక ప్రార్థనను లోక సంరక్షణకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుందని కొనియాడారు. ఏసుక్రీస్తు జన్మించిన విధానం లోకానికి రక్ష లాంటిదని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు తెలిపినటువంటి ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం మరియు వారు ఆలపించిన గేయాలు అందర్నీ ఆలోచింపజేశాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News