నేటిసాక్షి, సైదాపూర్:
కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆకునూరు గోపాలమిత్ర సెంటర్ తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ గోపాలమిత్ర విధుల నిర్వహణలో పెరుకపల్లె గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన వాహనాన్ని ఆపి తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ను గోపాల మిత్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపాల మిత్రుల పశుగణ అభివృద్ధికి కృషి చేయాలని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గోపాల మిత్రుల సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు. వ్యవసాయంతో పాటు రైతులు పాడి రైతులు పాడి పరిశ్రమను పెంపొందించుకోవాలని రైతులు అభివృద్ధి చెందే దిశగా నడవాలి అని కోరారు. అనంతరం గోపాలమిత్ర ఆకునూరు సెంటర్ తాళ్లపెళ్లి శ్రీనివాస్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువా కప్పి అభినందించారు. గోపాలమిత్ర సమస్యలను పరిష్కరిస్తానని ఆమె ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు తాళ్లపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

