- హుజూరాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద నివాళులు

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
మాజీ ప్రధాని అటల్ జీ ఈ దేశానికి అందించిన సేవలు అనిర్వచనియం అని కొనియాడారు. అటల్ ఆశయ సాధనలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు నిమగ్నం కావాలని కోరారు. పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటెరియన్ గా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రజాప్రతినిధిగా వెళ్లి ఈ దేశానికి సేవలందించడం గొప్ప విషయం. గొప్ప కవిగా విద్యావేత్తగా ఎన్నో సేవలు ఈ దేశానికి అందించారు. అణు పరీక్షలు నిర్వహించి శత్రు దేశాలకు వణుకు పుట్టేలా చేశారు. గ్రామ సడక్ యోజన పేరుతో ప్రతి పల్లెకు రోడ్డుని తీసుకువచ్చి పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేశారు. దమ్మక్కపేట గ్రామంలో 3 కి.మీ.ల మేర గ్రామీణ సడక్ యోజన స్కీమ్ లో రోడ్డు నిర్మాణం జరిగింది, ఆ రోడ్డు నందే ఈరోజు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించటం జరిగింది. ఇలా ఎన్నో రకాల సేవలందించి ఈ దేశాన్ని శక్తివంతమైనదిగా తయారు చేయడంలో అటల్ జీ ఒకరని కొనియాడారు. అటల్ జీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నాయకులు కార్యకర్తలు నిమగ్నం కావాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి , పట్టణ ప్రధాన కార్యదర్శిలు తూర్పాటి రాజు, వోడ్నాల విజయ్, సీనియర్ నాయకులు మంచికట్ల సదానందం, కొలిపాక శ్రీనివాస్, నరాల రాజశేఖర్, ములుగురి నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, అంకతి వాసు, తిప్పబత్తిని రాజు, యల్ల సంజీవరెడ్డి, వివిధ మోర్చా అధ్యక్షులు బోరగల సారయ్య, గంట సంపత్, వోడ్నాల చంద్రిక, ఆదర్శ రైతు గూడూరి మల్లారెడ్డి, ముచ్చ సమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య, బూత్ అధ్యక్షులు అపరాధ రమణ మోలుగూరి రాజు, తాళ్లపల్లి దేవేంద్ర, మొలుగురి అపర్ణ, స్వర్ణలత, కుసుమ సమ్మయ్య, హరీష్, విక్రమ్, బొడ్డు మహేష్, గోవిందుల అజయ్,మండల నాయకులు మర్రి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

