మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన గోపగోని సారయ్య గౌడ్..ఈ సందర్బంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ..క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని. క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉన్న చర్చిల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ప్రత్యేకంగా తీసుకొని ఎమ్మెల్యే విజయరమణ రావు దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడుతానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో సునీల్ రావు , ఆరెల్లి సుజాత -రమేష్ క్రిస్టియన్ మత పెద్దలు, ఫాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

