డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న ) :
యేసుక్రీస్తు జననం ప్రపంచానికి శాంతి,భారతదేశ ప్రజలందరికీ ప్రభు ఆశీస్సులు, దీవెనలు పాడిపంటలు సమృద్ధిగా కలుగ జేయాలని కోరుతున్నాని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని సీఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని, క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రపంచ శాంతి కొరకే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్నారు.ఈ కార్యక్రమంలో ఫాస్టర్స్ డేవిడ్ పాల్, మామిడి ప్రసాద్, క్రైస్తవ, సోదర, సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

