- ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, అధికార పార్టీ ఎంపీ, ఎంఎల్ఏ లు హాజరు.
నేటిసాక్షి, మెదక్ :
బుధవారం డిసెంబర్ 25 న మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, ఎల్లారెడ్డి ఎంఎల్ఏ మధన్ మోహన్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెదక్ ఎంఎల్ఏ రోహిత్, మైనంపల్లి హన్మంతరావు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, క్రిస్టియన్ మిషనరీ పాస్టర్లు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎంఎల్ఏ లు, అధికార పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా సంఖ్యలో పాల్గొనటం వలన ఈ ఏడాదికి చర్చి నిర్మాణం జరిగి వంద సంవత్సరాలు పూర్తికావడంతో క్రిస్టమస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

