భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ధమ్మపేట డిసెంబర్ 25/నేటిసాక్షి:
భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి శత జయంతి వేడుకల సందర్భంగా మందలపల్లి సెంటర్లో పసుపులేటి నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుపబడింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ముత్యాలరావు మాట్లాడుతూ నాగరాజుని ప్రశంసిస్తూ చిన్న వయసులోనే పార్టీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు, మందలపల్లి ప్రకాష్ నగర్ కాలనీ లో వెలిసిన ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి తన వంతు కృషి చేశాడని, ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ధార నాగేశ్వరావు, ఉడతనేని విశ్వేశ్వరరావు, పల్లపు వెంకటేశ్వరరావు, గూడ ముత్యాల రావు, కారం రత్న కుమారి, వాసం పాలయ్య, దొడ్డ సతీష్, మల్లికార్జున రావు, పుల్లారావు, పూచి ప్రసాద్, సొరకాయలు సీతారాములు, రాష్ట్ర సీనియర్ నాయకులు కొలికి పోగు ముసలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

