నేటిసాక్షి బ్యూరో నిజామాబాద్ (టి. ఎన్ రమేష్): కామారెడ్డి జిల్లాలో ఎస్.ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి మరియు బిబిపేట సొసైటీ ఆపరేటర్ నిఖిల్ లు కామారెడ్డి జిల్లాలోని అడ్లూరి ఎల్లారెడ్డి లో మూకుమ్మడి గా ఆత్మహత్య చేసుకున్న సంఘటన కు సంభందించిన విషయమై, గురువారం మధ్యానం కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందుశర్మ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని, పంచనామా అనంతరం, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా, మృతుల కుటుంబా సభ్యుల వాంగ్మూలం, వారి స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలం రికార్డు చేసి కేసును ఛేదించే పనిలో ఉన్నామని ఎస్పీ తెలిపారు. కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇప్పుడే ఎందుకు,ఎలా జరిగిందనే విషయాలు వెళ్లడించలేమని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు పూర్తయిన తరువాత అన్నివిషయలు తెలియజేస్తామని జిల్లా ఎస్పీ సిందుశర్మా తెలిపారు.

