- పొంగులేటి పర్యటనలో యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల నరేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 26 :
అశ్వారావుపేట నియేజక వర్గం దమ్మపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో నియేజక వర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ తో కలసి అన్నపురెడ్డిపల్లి యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల నరేష్ పాల్గొని మండలం నుండి వందల సంఖ్యలో యూత్ ను తన వెంట తీసుకువెళ్ళి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి తో పాటు మంత్రి సీతక్కను కూడా కలసి నూతన మండలం అయిన అన్నపురెడ్డిపల్లి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదే విధంగా మండలంలో జానికీపురం గ్రామంలో ఓణీల అలంకరణ పంక్షన్ లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ మండలంలో యూత్ అంత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. అని రానున్న రోజుల్లో యువతరం ఒక శక్తి అవుతుంది. అని ఎల్లవేళలా యూత్ సపోర్ట్ నాకు వుండాలని రానున్న రోజుల్లో యువతరం కోసం పెద ప్రజలు కోసం మంత్రులు తుమ్మల పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క శాసన సభ్యులు జారే ఆదినారాయణ గార్లు సహాయంతో అభివృద్ధికి బాటలు వేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మరియు మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

