Tuesday, January 20, 2026

పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం బి.సి.ఏ.వై.ఎఫ్. శ్రమిస్తోంది

  • బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ సంస్థ ఆధ్వర్యంలో పూలే జ్ఞాన కేంద్రం పేరిట రాష్ట్ర స్థాయి కోచింగ్ సెంటర్ ఏర్పాటు
  • ఫ్రీ కోచింగ్ సెంటర్ పోస్టర్ ఆవిష్కరణ

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెగా ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో “పూలే జ్ఞాన కేంద్రం” పేరిట ఏర్పాటు చేస్తున్న కోచింగ్ సెంటర్ పోస్టర్ ఆవిష్కరించారు. బీసీ విద్యార్థుల అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తిగా ఈ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జనవరి 20 తారీకు నుంచి ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని దరఖాస్తుల కోసం బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, కన్వీనర్లు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పేద బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేయనట్లు తెలిపారు. వివరాల కోసం 9701460698, 9852374374 లను సంప్రదించాలని కోరారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కరీం రాజు మాట్లాడుతూ ఒక ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కోచింగ్ సెంటర్ ఉచితంగా ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిదని దానికోసం కృషి చేస్తున్న ఉద్యమ నాయకుడు జక్కని సంజయ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇతర ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యే ఉద్యోగార్డులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని 500 మంది యువతి యువకులకు మొదటి విడుతగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులుగా కుడికల భాస్కర్, జిల్లా కన్వీనర్ చిలుకమరి శ్రీనివాస్, నాయకులు సంపత్ ముదిరాజు, బీసీ రాజ్యాధికార సమితి ఉత్తర ఫ్రీతెలంగాణ కో ఆర్డినేటర్ బుర్ర కుమార్ గౌడ్, వేముల రమేష్, చిర్ర సంపత్ కుమార్, పేరుమండ్ల సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News