- ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం వెంకట్రావుపల్లి లోని కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై గురువారం జరిగింది. కరీంనగర్ లోని ఎల్ఎండి కాలనీకి చెందిన మాశెట్టి అశోక్, మాశెట్టి ఆద్య, పోలవేణి గట్టు బాబులు పోలవేణి మంగ లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కారు లో గురువారం తిరిగి కరీంనగర్ వెళుతుండగా బోయిని పల్లి మండలంలోని వెంకట్రావు పల్లి లో ఆగి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న వెనుక నుండి ఢీకొనడంతో పోలవేణి మంగ (50) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.

