Tuesday, January 20, 2026

స్వేచ్ఛ, హక్కులు కల్పించిన మహోన్నతుడు మన్మోహన్​సింగ్​

మానాల మోహన్ రెడ్డి…

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి:
దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన తెలిసిందే.. శుక్రవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో మండల అధ్యక్షులు తూమ్ జలపతి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమానికి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటని, అదేవిధంగా పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ రథసారధిగా పార్టీ కోసం, అదేవిధంగా ప్రధానిగా దేశ ప్రజలకు హక్కులు కల్పించడంలో మన్మోహన్ సింగ్ ఆలోచన ఎన్నటికీ మరువలేనివని, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి దేశ ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే స్వేచ్ఛను హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తి అని, గ్రామీణ ప్రాంతాల్లో కూలి దొరకని రోజుల్లో 100 రోజులు ఉపాధి హామీ పనిని తీసుకువచ్చి కూలిని అందించిన వ్యక్తి అని, అదేవిధంగా అమెరికాతో అను ఒప్పందం గాని మరిముఖ్యంగా చిన్న భిన్నంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఒక సరైన మార్గంలో పెట్టి ప్రతి ఒక్క భారతీయుడు తలెత్తుకునే విధంగా చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన 10 సంవత్సరాల ప్రధాని కాలంలో రూపాయి విలువను ఏ మాత్రం తగ్గకుండా చూశారని దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ కంటే ముందు మన్మోహన్ సింగ్ తర్వాత అని చెప్పుకునే విధంగా చేశారని, మౌనంగా ఉంటూనే దేశ ప్రజల అభివృద్ధి కొరకు దేశ అభివృద్ధి కొరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని మానాల మోహన్ రెడ్డి కొనియాడారు. గిరిజనుల పక్షాన నిలిచి వారికి పోడు భూముల పట్టాలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎన్నటికి మరువలేనివని దేశం ఒక మంచి ఆర్థికవేత్తను, సలహాదారున్ని, మంచి మనిషిని కోల్పోయిందని మన్మోహన్ సింగ్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మానాల మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్ జలపతి,సీనియర్ పార్టీ నాయకులు తుమ్ రవీందర్,లక్కాకుల రమేష్, జక్కు మోహన్, బుర్ర శంకర్,జక్కు వంశీ,రాజు నాయక్,రూపాల తిరుపతి, కిషన్ నాయక్,హరిసింగ్ నాయక్, రాందాస్,గురుదాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తదితరులు నివాళి అర్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News