నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని సరిత ఇంటి దగ్గర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చిత్రపటానికి సరిత తిరుపతయ్య నివాళులులు అర్పించడం జరిగింది. సరిత తిరిపతయ్య మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థికరంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డగా కొనియాడారు. ఆయన బలహీన ప్రధాని కాదని నిరూపించుకున్నారు. మన్మోహన్ సింగ్ మరనినించడంతో భారత దేశానికి తీరని లోటని శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.

