- దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి
- దూరదృష్టి, ఆర్ధిక చాణిక్యాలతో దేశాన్ని ముందు నడిపిన దీరశాలి
- ఎన్నో ఒడుదుడుకలు అనుభవిస్తూ దేశ ప్రధానిగా ఎన్నో సేవలందించారు
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్…!!
– మత్స్య శాఖ కారుల సంఘం జిల్లా అధ్యక్షులు నందిమల్ల యాదయ్య..!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
భారతదేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, ఆదేశం మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి, భారత ఆర్ధిక వ్యవస్థకు తీరనిలోటు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ తెలిపారు. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మరణవార్త నన్ను దిగ్బ్రాంతికి గురించేసిందని వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడుని వేడుకుంటున్న. ఆర్బిఐ గవర్నర్గా, రాజ్యసభ సభ్యునిగా, దేశ ఆర్థిక మంత్రిగా పి.వి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉందంటే దీని వెనక మన్మోహన్ సింగ్ ఎన్నో సేవలందించారు. ఆయన కృషి కష్టం ఎంతగానో ఉందని దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోదగ్గ స్థాయికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రయాణం కొనసాగిందని వారు ఈ రోజు లేకపోవడం దేశానికి తీరని లోటని వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను .డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మత్స్య శాఖ కారుల సంఘం జిల్లా అధ్యక్షులు నదిమల్ల యాదయ్య మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మౌనం పాటించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గొప్ప మేధావిని భారతదేశం కోల్పోయిందని వారి మరణం దేశానికి తీరని లోటని ఆయన అన్నారు. 2004లో దేశ ప్రధానిగా ఉపాధి హామీ పథకం,సమాచార హక్కు చట్టం,విద్య హక్కు చట్టం,తీసుకు రావడంతోపాటు 2008లో అగ్రరాజ్యాలు ఆర్ధిక సంక్షోభలు ఎదుర్కొన్న దురదృష్టితో ముందే ఆలోచించారు.ఆయన పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ఉన్నత స్థితికి చేర్చారని,రాబోయే 100 సంవత్సరాలు కూడా దేశానికి వారు చేసిన సేవలను భావితరాలు గుర్తు చేసుకుంటాయని ఆయన చెప్పారు.తెలంగాణ ఉద్యమం సందర్భంగా వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఎంతో మంది ఎన్నో అడ్డంకులు సృష్టించినా అందరిని ఒప్పించారని, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చాం కాబట్టి, మాట ప్రకారం తెలంగాణ ఇవ్వాల్సిందే అని ఆయన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని,వారికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని మత్స్య శాఖ కారుల సంఘం జిల్లా అధ్యక్షులు నందిమల్ల యాదయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీర్ల జనార్ధన్ సాగర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు అట్టడుగు వర్గాల వారి సంక్షేమానికి కృషి చేశారని, వారి హయాంలో నే రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఐ లాంటి చట్టాలతో పాటు పేదవారికి సంవత్సరం లో వందరోజులు పనిదినాలు కల్పించి వారికి అండగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి,జిల్లా దివ్యాంగుల సెల్ అధ్యక్షులు గంజాయి రమేష్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సమ్మద్ మియా, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం డి బాబా, గోపాల్పేట మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, రాగి వేణు, కోళ్ల వెంకటేష్, ఆవుల చంద్రశేఖర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

