నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
సైకిల్ ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శత్రాజుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన స్వాత్రిక్ అనే (12), బాలుడు సెలవులు కావడంతో తన అమ్మమ్మ ఇంటికి శత్రాజుపల్లి గ్రామానికి రాగ శుక్రవారం ఉదయం గ్రామంలో సైకిల్ పై ప్రయాణిస్తున్న క్రమంలో బాలుడిని లారీ ఢీకొట్టడంతో స్వాత్రిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోగా ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు వెంబడించి వట్టెంల గ్రామంలో గ్రామస్థులు పట్టుకున్నారు. సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

